Pune Porsche car crash: మైనర్‌ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు | Pune Porsche car crash: Two Juvenile Justice Board members terminated from service for misusing powers | Sakshi
Sakshi News home page

Pune Porsche car crash:మైనర్‌ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు

Oct 11 2024 5:15 AM | Updated on Oct 11 2024 5:15 AM

Pune Porsche car crash: Two Juvenile Justice Board members terminated from service for misusing powers

పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్‌ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసిన కేసులో జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్‌.ఎన్‌.దన్వాడే, కవితా థోరట్‌లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. 

ఈ మేరకు జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్‌ ప్రాంతంలో ఓ బిల్డర్‌ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement