తినండి.. బుల్లెట్‌ గెలవండి

Pune Eatery Launches Contest Finish Thali and Win Royal Enfield Bullet - Sakshi

బుల్లెట్‌ లవర్స్‌ని ఆకర్షిస్తోన్న సవాలు

12 రకాల వంటకాలు.. నాలుగు కేజీల బరువుండే థాలి

60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తే బుల్లెట్‌ ఫ్రీ

థాలి ఖరీదు రూ. 2500

ముంబై: కరోనా వైరస్‌ దెబ్బకు దేశంలో అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హోటల్‌ వ్యాపారాలు నేటికి కోలుకోలేదు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి జనాలు బయటి తిండి అంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు హోటల్‌ యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ఆఫర్‌ జనాలను టెంప్ట్‌ చేయడమే కాక రెస్టారెంట్‌కు క్యూ కట్టెలా చేస్తుంది. ఆ వివరాలు.. పుణె అవుట్‌ స్కర్ట్స్‌లో ఉన్న శివరాజ్‌ హోటల్‌ కస్టమర్లను ఆకర్షించేందుకు.. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఓ వెరైటీ సవాలు ప్రకటించింది. ఇక ఇందులో గెలిచిన వారికి ఏకంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపింది. 

ఇంతకు సవాలు ఏంటంటే 60 నిమిషాల వ్యవధిలో భారీ బుల్లెట్‌ థాలిని పూర్తి చేయాలని ప్రకటించింది. దాదాపు నాలుగు కేజీల బరువుండే భారీ నాన్‌ వెజ్‌ థాలిని 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసిన వారికి 1,60,000 రూపాయల ఖరీదు చేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ని బహుమతిగా ఇస్తామని పేర్కొన్నది. ఇక పోటీకి సంబంధించిన కండీషన్‌లని, థాలిలో ఉండే పదార్థాలను సూచించే మెనుకు సంబంధించిన బ్యానర్‌లను ముద్రించి ప్రచారం చేస్తుంది. (చదవండి: యూట్యూబర్‌ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్‌ మూత)

బుల్లెట్‌ థాలిలో ఉండే పదార్థాలు..
ఇక నాన్‌-వెజ్‌ బుల్లెట్ థాలిలో 4 కిలోల మటన్, వేయించిన చేపలతో తయారు చేసిన సుమారు 12 రకాల వంటకాలు ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పామ్‌ఫ్రేట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తాండూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలంబి (ప్రాన్) బిర్యానీ వంటి వంటకాలు ఉంటాయి. ఇక ఈ థాలిని సిద్ధం చేయడానికి 55 మంది సభ్యులు పని చేశారు. 

స్పందన ఎలా ఉంది..
థాలిని ప్రయత్నించడానికి, పోటీలో పాల్గొనడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో తన రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారని.. పోటీ పట్ల స్పందన చాలా బాగుందని రెస్టారెంట్‌ యజమాని అతుల్ వైకర్ తెలిపారు. ఇక తాము కోవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నట్లు వైకర్ హామీ ఇచ్చారు. ఈ హోటల్‌ రోజుకు 65 థాలిలను విక్రయిస్తుంది. ఇక శివరాజ్ హోటల్ ఆరు రకాల భాదీ థాలిలను అందిస్తుంది - స్పెషల్ రావన్ థాలి, బుల్లెట్ థాలి, మాల్వాని ఫిష్ థాలి, పహెల్వాన్ మటన్ థాలి, బకాసూర్ చికెన్ థాలి, సర్కార్ మటన్ థాలి వంటి వెరైటీలు ఉన్నాయి. (చదవండి: దీన్ని 20 నిమిషాల్లో తింటే రూ.90 వేలు మీవే!)

థాలి ధర ఎంత...
ప్రతి తాలి ధర 2,500 రూపాయలు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన శివరాజ్ హోటల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆఫర్లను పరిచయం చేస్తుంది. గతంలో, 8 కిలోల రావన్ థాలిని 60 నిమిషాల్లో పూర్తి చేయడానికి నలుగురు వ్యక్తులకు ఒక పోటీని ఏర్పాటు చేశారు. విజేతకు 5,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఇక థాలికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. (చదవండి: రెస్టారెంట్‌ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!)

ఇప్పటి వరకు ఎవరైనా గెలిచారా..
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నివాసి సోమనాథ్ పవార్ బుల్లెట్ థాలిని ఒక గంటలోపు పూర్తి చేయగలిగాడని అతుల్ వైకర్ తెలిపారు. అతనికి బుల్లెట్ బహుకరించారు.

                                                          (విన్నర్‌)

                                         

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top