దీన్ని 20 నిమిషాల్లో తింటే రూ.90 వేలు మీవే! | Food Challenge: Finish Burger In 2O Min Get Rs 90k Food Voucher | Sakshi
Sakshi News home page

బ‌ర్గ‌ర్ తినండి: రూ.90 వేల గిఫ్ట్ వోచ‌ర్ పొందండి

May 27 2020 5:46 PM | Updated on May 27 2020 6:06 PM

Food Challenge: Finish Burger In 2O Min Get Rs 90k Food Voucher - Sakshi

లండ‌న్‌: ఇంట్లో వంట తినీతినీ బోర్ కొడుతుంద‌నేవారికి వారికి ఇది త‌ప్ప‌కుండా నోరూరించే వార్త‌. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లోని టేక్ అవే రెస్టారెంట్ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. వాళ్లు తయారు చేసిన ఓ బ‌ర్గ‌ర్‌ను 20 నిమిషాల్లో తినేస్తే.. రూ.93 వేలు ఇస్తార‌ట‌. అయితే ఆ బ‌హుమానం న‌గ‌దు రూపేణా కాదండోయ్‌.. ఫుడ్ వోచ‌ర్ ద్వారా! మ‌రి అంత పెద్ద మొత్తంలో ఆఫ‌ర్ ప్ర‌క‌టించారంటే బ‌ర్గ‌ర్‌కూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుందిగా. మ‌రేం లేదు.. ఆ బ‌ర్గ‌ర్ మిగ‌తా వాటి క‌న్నా పెద్ద‌దిగా అంటే సుమారు 14 ఇంచులుండ‌ట‌మే కాక‌ రెండు కిలోల బ‌రువుంది. సాధార‌ణంగా అయితే ఇది ప‌దిమందికి సుల‌భంగా సరిపోతుందంటున్నారు ఆ రెస్టారెంట్ య‌జ‌మాని యునుస్ సెవినిక్‌. లాక్‌డౌన్‌తో ఎంతో న‌ష్ట‌పోయామ‌ని, భోజ‌న ప్రియుల‌ను ఆక‌ర్షిస్తూ తిరిగి రెస్టారెంట్‌కు మునుప‌టి వైభ‌వం తెచ్చేందుకు ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించామ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. (హలీమ్‌.. వియ్‌ వాంట్‌ యూ..)

అయితే ఆ బ‌ర్గ‌ర్ ధ‌ర కూడా త‌క్కువేమీ కాదు. మూడు వేల పైచిలుకే ఉంది. దీని గురించి యునుస్ మాట్లాడుతూ.. "‌నా రెస్టారెంట్‌లో కాస్త‌ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కొంద‌రంటున్నారు. నిజ‌మే, ఎందుకంటే నేను చ‌వ‌క స‌రుకులు తీసుకురాను. పైగా ఇంట్లో సొంతంగా త‌యారు చేస్తా"న‌ని చెప్పుకొస్తున్నాడు. కాగా క‌రోనా క‌ట్ట‌డికిగానూ మున్ముందు కూడా భౌతిక దూరం వంటి నిబంధ‌నలు పాటించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీంతో రెస్టారెంట్లు కొత్త ఆలోచ‌న‌లతో మ‌రింత వినూత్నంగా సిద్ధ‌మ‌వుతున్నాయి. బ్యాంకాక్‌లో ఓ రెస్టారెంట్.. క‌స్ట‌మ‌ర్లు ఒంట‌రిగా భోజ‌నం చేస్తున్నార‌న్న అనుభూతి చెంద‌కుండా ప్ర‌తీ టేబుల్ ద‌గ్గ‌ర పాండా బొమ్మ‌ల‌ను పెట్టి ఉంచారు. సిడ్నీలోనూ ఓ చోట మ‌నుషుల ఆకృతిలో‌ అట్ట బొమ్మ‌లను త‌యారు చేయించి క‌స్ట‌మ‌ర్లు కూర్చునే చోట పెట్టారు. (లా​క్‌డౌన్‌ సడలింపులు : అమెజాన్ గుడ్ న్యూస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement