అహ్మదాబాద్: గుజరాత్‌లోని అత్యంత భద్రత కలిగిన సబర్మతీ సెంట్రల్ జైలులో మంగళవారం విచారణ ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైసిన్ ఉగ్ర కుట్ర కేసులో అనుమానితుడు, హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ గాయపడ్డాడు. ఇతడి ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. గుర్తు తెలియని కారణాలతో సయ్యద్, మరో ముగ్గురి మధ్య గొడవ చోటుచేసుకుంది.
గాయపడిన సయ్యద్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చాం’అని జైలు సూపరింటెండెంట్ గౌరవ్ అగర్వాల్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఎంబీబీఎస్ డాక్టరైన సయ్యద్ గుజరాత్ ఏటీఎస్ ఈ నెల 8వ తేదీన అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఒకడు. రైసిన్ అనే ప్రమాదకరమైన విష పదార్థం, ఆయుధాలతో ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్లు ఇతడిపై అభియోగాలున్నాయి.


