అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి

PM Narendra Modi makes a last appeal to MP, Chhattisgarh voters - Sakshi

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు    

న్యూఢిల్లీ: రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం ‘ఎక్స్‌’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ, ప్రతికూల రాజకీయాలతో జనం విసుగెత్తిపోయారని వెల్లడించారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఇచి్చన హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. జనం ఆకాంక్షలను నెరవేర్చడం తమ బాధ్యత అని వివరించారు.

కాంగ్రెస్‌ ఇస్తున్న డొల్ల హామీలు నమ్మొద్దని, సుపరిపాలన అందించే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తమ పార్టీ పట్ల జనం అచంచల విశ్వాసం చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లనే ప్రగతి సాధ్యమని వారు నమ్ముతున్నారని వివరించారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్ల కలిగే మేలు ఏమిటో మధ్యప్రదేశ్‌ ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని అదికారంలోకి తీసుకురావాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించి, బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం తనకు సంపూర్ణంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top