మోదీ యూట్యూబ్ సబ్‌స్రైబర్లు 2 కోట్లు | Sakshi
Sakshi News home page

మోదీ యూట్యూబ్ సబ్‌స్రైబర్లు 2 కోట్లు

Published Wed, Dec 27 2023 11:25 AM

PM Modi YouTube Subscribers Cross 2 Crore - Sakshi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఛానల్ సబ్‌స్రైబర్లు రెండు కోట్లు దాటారు. ప్రపంచంలో ఈ ఘనత దక్కిన నేత నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. 

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దీనిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇందులో పోస్టు చేసిన వీడియోలకు 450 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఛానల్ సబ్‌స్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో 64 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. 

వ్యూస్ అంశంలో మోదీ తర్వాత ఉక్సెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఉన్నారు. జెలెన్ స్కీ పోస్టు చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్‌స్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది ఉన్నారు.

ఇదీ చదవండి: అఫీషియల్‌: మణిపూర్‌ నుంచి ముంబై దాకా రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయయాత్ర’

Advertisement
 

తప్పక చదవండి

Advertisement