
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు.. మూడోసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన మెగా ర్యాలీలో ప్రధాని మోదీ భవిష్యత్ ప్రణాళికలను గురించి మాట్లాడారు.
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని.. రాబోయే ఐదేళ్ల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. మేము ఎలాంటి ప్రధాన నిర్ణయాలను తీసుకున్నామన్న దానిపై పనులు వేగంగా జరుగుతున్నాయని మోదీ స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు.
గత 10 సంవత్సరాలలో, మీరు అభివృద్ధికి సంబంధించిన ట్రైలర్‌ను మాత్రమే చూశారు. ఇకపైన మనం దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. 2024 ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అని అన్నారు.
2024లో భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 10 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతిని గురించి మోదీ వివరించారు. భారతదేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు శరవేగంగా నిర్మితమవుతున్నాయి. నేడు దేశంలోని మహిళా శక్తి కొత్త తీరాలవైపు అడుగులు వేస్తోంది. నేడు భారతదేశం విశ్వసనీయత కొత్త శిఖరాలకు చేరుకుంది. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని విస్మయంతో చూస్తోంది" అని ఆయన అన్నారు.
उत्तर प्रदेश समेत पूरे देश के मेरे परिवारजन भाजपा-एनडीए को वोट देकर हमें तीसरी बार जनसेवा का मौका देने का मन बना चुके हैं। मेरठ में विशाल जनसभा को संबोधित कर रहा हूं।https://t.co/AQlY40HdzT
— Narendra Modi (@narendramodi) March 31, 2024