
గాంధీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ప్రధాని 'నరేంద్ర మోదీ' గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సురేంద్రనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల రాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ తన బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. రామ భక్తులు, శివభక్తుల మధ్య విభేదాలు సృష్టించి ఒకరితో ఒకరు కొట్టుకోవాలని భావిస్తున్నారు. మొఘలులు కూడా వేల ఏళ్ల నాటి సంప్రదాయాలను ఉల్లంఘించలేకపోయారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దానిని తుంగలో తొక్కాలని చూస్తోందా? అని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం పార్టీ అభ్యర్థి శివకుమార్ దహరియాకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. అతని పేరు శివకుమార్. అతను శివుడు కాబట్టి రామ్‌తో పోటీ పడగలడు. నేను మల్లికార్జున్. మల్లికార్జున్ అనేది శివునికి మరో పేరు. అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి శివుడు, రాముడు మధ్య విబేధాన్ని చూపిస్తాయని మోదీ అన్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తమకు పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్, దాని మద్దతుదారులు తిరస్కరించారని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రాంగ్ డెలివరీ చేసే పార్టీ అని మోదీ అన్నారు.
స్వాతంత్య్రానికి బదులు దేశ విభజన చేశారు..అభివృద్ధికి బదులు ఉన్న దానిని దోచుకున్నారు.. పేదలకు తిరిగి ఇచ్చే బదులు ఆ డబ్బుతో కాంగ్రెస్ తన ఖజానా నింపుకుంది.. ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ కోరుతోంది. గత మూడు దశాబ్దాలుగా వారు ప్రయత్నిస్తున్నారని మోదీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోంది. కానీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ అంశంలో ఆ పార్టీ నోరు మెదపడం లేదని మోదీ అన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని వెన్నులో పొడిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అన్ని ప్రభుత్వ టెండర్ల కేటాయింపులో మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు ప్రత్యేక కోటాను ప్రతిపాదించిందని మోదీ ఆరోపించారు.
Ecstatic mood at the rally in Surendranagar. People here have always supported the BJP.https://t.co/BYUR748YMe
— Narendra Modi (@narendramodi) May 2, 2024