న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఢిల్లీలోని సౌత్‌బ్లాక్ భవనంలో కొనసాగుతున్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని జనవరి 14వ తేదీన అంటే మకర సంక్రాంతి పండగ రోజున నూతన భవనసముదాయంలోకి మార్చనున్నారు. రైసినా హిల్స్ సమీపంలో అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించిన సేవాతీర్థ్–1 భవంతిలోకి ప్రధాని కార్యాలయం(పీఎంఓ)ను మార్చే స్తారని సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మకర సంక్రాంతి రోజున కొత్త భవనంలో ప్రధాని మోదీ అడుగుపెడతారని తెలుస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కీలక కార్యాల యాల కోసం ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ కాంప్లెక్స్(సేవా తీర్థ్)ల పేరిట కొత్త భవనాలను నిర్మిస్తున్న విషయం విదితమే. డల్హౌసీ రోడ్(దారా షికో రోడ్)లో సేవా తీర్థ్–1 భవనాన్ని కట్టారు. ప్రధాని కార్యాలయా న్ని ఈ కొత్త భవనంలోకి మార్చనున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రప తిభవన్ సమీపం భవనంలో సేవలందించిన కేబినెట్ సెక్రటేరియట్ విభాగం కొత్తగా కట్టిన సేవాతీర్థ్ పార్ట్–2 భవనంలోకి ఇప్పటికే మారిపోయింది.
పార్లమెంట్ స్ట్రీట్‌లోని సర్దార్ పటేల్ భవన్‌లో భారత జాతీయ భద్రతా మండలి సచివాలయం(ఎన్‌ఎస్‌సీఏ) ఉండేది. సేవా తీర్థ్–3 భవనంలోకి ఎన్‌ఎస్‌సీఎస్ కార్యాలయం మారిపోనుంది. సెంట్రల్ విస్టాలో భాగంగా కడు తున్న నూతన ప్రధాని అధికారిక నివాసం ఇంకా నిర్మాణ దశలో ఉంది. కేంద్ర ప్రజాపనుల విభాగం నుంచి 2022లో కాంట్రాక్ట్ సంపాదించిన లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ రూ.1,189 కోట్ల వ్యయంతో 2,26, 203 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మిస్తోంది.
నాటి బ్రిటిష్‌పా లకులు 1920, 1930 దశకాల్లో కేంద్ర ప్రభుత్వం కార్యాల యాలకోసం రాష్ట్రపతిభవన్‌కు వెళ్లేదారిలో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ పేరిట ఎర్రని ఇసుక రాళ్లతో అద్భుతమైన భవనాలను నిర్మించారు. ఈ సౌత్ బ్లాక్‌లోనే నాటి నెహ్రూ హయాం నుంచి ప్రధాని కార్యా లయం పని చేస్తోంది. దశాబ్దాల తర్వాత ఎట్టకేల కు ఈ ఆఫీస్ కొత్త భవనంలోకి తరలిపోతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్‌లు ఖాళీ చేశాక ఈ భవనాలను మోదీ సర్కార్ ‘యుగే యుగేన్ భారత్ సంగ్రహాలయ’ జాతీయ మ్యూజియంగా రూపు రేఖలు మార్చేయనుంది. మ్యూజియం ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక తోడ్పాటును ఫ్రాన్స్ మ్యూజియం డెవలప్‌మెంట్ ఏజెన్సీ అందించనుంది. ఆ తర్వాత సాధారణ ప్రజలను సందర్శనలకు అనుమతిస్తారు.


