ప్రజల జేబులు నింపే బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ | PM Modi Hails Union Budget 2025-26 | Sakshi
Sakshi News home page

ప్రజల జేబులు నింపే బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ

Feb 1 2025 3:14 PM | Updated on Feb 1 2025 3:26 PM

PM Modi Hails Union Budget 2025-26

సాక్షి,న్యూఢిల్లీ:ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో శనివారం(ఫిబ్రవరి1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఈ బడ్జెట్‌ నెరవేరుస్తుందన్నారు. బడ్జెట్‌పై శనివారం మధ్యాహ్నం మోదీ స్పందించారు.‘భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు సంబంధించిన బడ్జెట్‌.ఈ బడ్జెట్‌ ప్రతీ భారతీయుడి కలను నెరవేరుస్తుంది. 

బడ్జెట్‌ ద్వారా అనేక రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాన్యులే వికసిత్‌ భారత్‌ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లేలా ఈ బడ్జెట్‌ తోడ్పడుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానను ఎలా నింపాలన్నదానిపై బడ్జెట్‌ ఫోకస్‌ ఉంటుంది. కానీ ఈ బడ్జెట్‌ సామాన్యుల జేబులు ఎలా నింపాలన్నదానిపై దృష్టి పెట్టి రూపొందించినది. 

ఈ బడ్జెట్‌తో దేశ పౌరులు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులకు తలుపులు తెరవడం​ లాంటి చర్యలు ఈ బడ్జెట్‌లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలు’అని ప్రధాని కొనియాడారు. 

కాగా, కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయించడంతో పాటు పాత విధానంలోనూ శ్లాబులు మార్చి పన్ను తగ్గించారు. దీంతో ఈ బడ్జెట్‌ ప్రజల చేతిలో మిగులు ధనం ఉండేందుకు దోహదం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement