ఛత్‌ వేడుకల్లో విషాదం.. వివిధ ప్రాంతాల్లో 22 మంది మృతి

Patna City Chhath Puja 2023 22 People Died - Sakshi

బీహార్‌లోని పలు ఛత్ ఘాట్‌ల వద్ద నీట మునిగి 22 మంది మృతిచెందారు. ఆది, సోమవారాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు యువకులు, ఏడుగురు యువతులు, ఒక బాలిక సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. 

షాపూర్ సమీపంలోని బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదరులతో సహా ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జనం జగన్‌పుర సమీపంలోని కొత్త బైపాస్‌ రోడ్డును దిగ్బంధించి, ట్రాఫిక్‌ చెక్‌పోస్టును ధ్వంసం చేసి దానిని తగులబెట్టారు. సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. 

దర్భంగా జిల్లాలోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్‌పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్‌ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు. 
ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top