గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్‌..

Owaisi Slams Fadnavis Over AurangZeb Remark Amid kolhapur Clashes - Sakshi

మహారాష్ట్ర: ఔరంగాబాద్‌ వివాదాస్పద వాట్సప్ స్టేటస్‌ల వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎమ్‌ఐఎమ్‌ నాయకుడు అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు.  ఔరంగజేబు కుమారులు నగరంలో ప్రత్యక్షమయ్యారనే ఫడ్నవీస్ వ్యాఖ్యలకు అసదుద్ధీన్.. గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో తెలుసుకోవాలని? అన్నారు.

కొల్లాపూర్‌లో కొందరు యువకులు ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లను కీర్తిస్తూ వాట్సప్ స్టేటస్‌లను పెట్టడం వివాదాస్పదమైంది. తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరిగాయి. అయితే.. ఈ వివాదంపై ఫడ్నవీస్.. నగరంలో కొందరు ఔరంగాజేబు కుమారులు ప్రత్యక్షమయ్యారని, వారెవరో తొందరగా గుర్తిస్తామని అన్నారు. వారు ఎవరి మనుషులో? ఎవరు పంపించారో కనుక్కుంటామని వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన అసదుద్ధీన్ ఓవైసీ.. ఫడ్నవీస్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'నాథూరాం గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టే కుమారులెవరో తెలుసుకోవాలి. మీకు అన్నీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నిపుణులని తెలుసు?' అని అన్నారు.

అయితే.. బుధవారం ఈ వివాదంపై జరిగిన ఘర్షణల కారణంగా స్థానికంగా కర్ఫ్యూ విధించారు. అందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. 

ఇదీ చదవండి:ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top