ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష

Orissa High Court reviews its performance in 2021 - Sakshi

కటక్‌: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష జరుపుకుంది. ఈ మేరకు వార్షిక నివేదిక–2021ను ఇటీవల విడుదల చేసింది. జవాబుదారీతనంతో ఉండటం, నిర్దేశిత లక్ష్యంతో పనిచేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఎదురైన సవాళ్లు, ప్రధాన తీర్పు, పేరుకుపోతున్న కేసుల తీరును వివరించింది.

ఇందులో..హైకోర్టులో 40 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 400కుపైగానే ఉన్నట్లు తెలిపింది.  కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో కోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగించడం ప్రధాన సవాల్‌గా మారిందని పేర్కొంది. కోవిడ్‌ కారణంగా ఏడాదిలో 67.20 రోజులను జిల్లా కోర్టులు నష్టపోయాయని తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top