ఆగస్టు 25, 26న ‘ఇండియా’ కూటమి సమావేశం

Oppositions INDIA bloc to meet for third time on August 25 and 26 at Mumbai - Sakshi

న్యూఢిల్లీ: 26 పార్టిలతో కూడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 25, 26న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఈ భేటీకి శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే), నేషనలిస్టు కాంగ్రెస్‌ పారీ్ట(శరద్‌ పవార్‌) ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

విపక్షాల తొలి సమావేశం బిహార్‌ రాజధాని పాటా్నలో, రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగే మూడో సమావేశంలో ప్రధానంగా సీట్ల పంపకంపై విపక్ష నాయకులు చర్చించనున్నట్లు సమాచారం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top