నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు! | Mumbai Rent Shock Viral Video Exposes 1 2 Lakh Monthly Burden in Andheri West | Sakshi
Sakshi News home page

నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు!

Mar 19 2026 1:41 PM | Updated on Mar 19 2026 1:55 PM

Mumbai Rent Shock Viral Video Exposes 1 2 Lakh Monthly Burden in Andheri West

కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.

ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్‌స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్‌కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement