breaking news
monthly budget
-
అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే!
వచ్చేదే అరకొర. పొదుపుగా వాడుకోవాలి. అందులోనే దాచుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురైతే ఎలా అని వెంటాడే ఆలోచనలు.. ఇదీ పైసా పైసా లెక్కబెట్టే ఓ సగటు దిగువ మధ్య తరగతి ‘జీవి’తం. దేశంలో దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సగటు ఆదాయం నెలకు రూ. 33,000. ఖర్చులు రూ. 20,000 వరకు ఉంటున్నాయి. మిగిలిన రూ.13 వేలల్లోనే వారి కలలు, ఆకాంక్షలు, నిర్ణయాలు అన్నీ ముడిపడి ఉంటున్నాయని ‘హోమ్ క్రెడిట్’ సంస్థ నివేదిక చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో నెలవారీ సగటు వ్యయాలూ పెరిగాయని వెల్లడించింది.దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది కస్టమర్లున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘హోమ్ క్రెడిట్ ఇండియా’ విడుదల చేసిన ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక ప్రకారం నెలవారీ వ్యయాలు పోను తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్న వారు 50% మంది మాత్రమే. ఖర్చులతోనూ వెళ్లదీస్తూ, ఆదా చేయలేకపోతున్నవారు 38% మంది ఉన్నారు. 12% మంది నెలవారీ అవసరాల కోసం అప్పు చేస్తున్నారు. ప్రాంతాలు, తరాల వారీగా ఆదాయాల్లో వ్యత్యాసం, కొనుగోళ్ల తీరు వేరుగా ఉందని ఈ నివేదిక తెలిపింది. ఆదాయం రూ.5 లక్షలలోపు..వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపుల ఆధారంగా 17 నగరాలలోని 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. వీరిలో పురుషులు 84%, స్త్రీలు 16% ఉన్నారు. జెన్ –జడ్ (13–28 ఏళ్లు) 19%, మిలీనియల్స్ (29–44 ఏళ్లు) 53, జెన్ –ఎక్స్ (44–59 ఏళ్లు) 28% ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో కార్మికులు 42 %, వ్యాపారులు 29, వేతన జీవులు 22, స్వయం ఉపాధి పొందుతున్నవారు 7% ఉన్నారు.పొదుపులో జెన్ –జడ్జెన్ –జడ్ తరంలో అత్యధికంగా 56% మంది పొదుపు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మిలీనియల్స్‌లో ఇది 53%. వీరితో పోలిస్తే జెన్ –ఎక్స్‌లో తక్కువగా 41% మంది మాత్రమే సేవింగ్స్‌కు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నవారిలో జెన్ –జడ్ తరం నుంచి 33% ఉన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక మార్గదర్శకులు కావాలని 58% మంది భావిస్తున్నారు. జెన్ –జడ్ విషయంలో ఈ సంఖ్య 65%, మిలీనియల్స్‌లో 59% ఉన్నారు. ఇక భారత్‌లో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక సగటు ఆదాయం రూ.38,600 నమోదు చేయగా, ఉత్తరాది, తూర్పున ఇది సగటున రూ.30,300గా ఉంది. బెంగళూరు రూ.45,700తో తొలి స్థానంలో నిలిచింది. రూ.39,200తో హైదరాబాద్, రూ.35,800 తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఆకాంక్షలతోపాటు ఆందోళనలు..వచ్చే అయిదేళ్లలో వ్యాపారం ప్రారంభించడం, విస్తరించాలని 23% మంది లక్ష్యంగా చేసుకున్నారు. ఇల్లు కొనుక్కోవాలని 23% ఆకాంక్షించారు. పిల్లల విద్యకు పొదుపు చేయాలని 15% మంది, రుణాల చెల్లింపు 11%, కారు కొనుగోలు 11%, విదేశీ టూర్ వెళ్లాలని 7% మంది భావిస్తున్నారు. దాదాపు 60% మంది తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. పిల్లల చదువులకు ఖర్చులు సరిపోవడం లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తగినంత పొదుపు లేదని, రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని, ఉద్యోగం లేదా ఆదాయ వనరు కోల్పోయామని, పదవీ విరమణకు సరిపడా డబ్బు లేవని ఆవేదన చెందుతున్నారు.దుకాణాలకు వెళ్లి..దుస్తులు, ఫ్యాషన్ , మొబైల్ ఫోన్ ్స, గృహోపకరణాలు, సరుకులు, మందులు.. ఈ విభాగాల్లో కస్టమర్లు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మొత్తం కొనుగోళ్లలో ఏకంగా 83–85% ఆఫ్‌లైన్ లోనే నమోదు కావడం గమనార్హం. బస్సు, రైలు టికెట్ బుకింగ్స్, ఫుడ్ ఆర్డర్స్‌లో ఆఫ్‌లైన్ వాటా 58–59%గా ఉంది. రుణాల చెల్లింపుల్లో 50%, బిల్ పేమెంట్స్‌లో 54% ఆన్లైన్లోనే చేస్తున్నారు.రూ.20వేల వరకు ఖర్చులకే సరిపోతోంది⇒ పొదుపు చేయగలుగుతున్న వారు 50% మంది⇒ భారీగా పెరిగిన పిల్లల చదువు వ్యయం⇒ గతేడాదితో పోలిస్తే 34% పెరుగుదల⇒ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు⇒ ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక⇒ కొనుగోళ్లలో సుమారు 85% ఆఫ్‌లైన్ లోనే -
నెలవారీ బిల్లులు భారం
న్యూఢిల్లీ: ఆహార, వ్యక్తిగత సంరక్షణ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తుల ధరల పెంపుతో నెలవారీ షాపింగ్ బిల్లులు గడిచిన రెండు మూడు నెలల్లో పెరిగిపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బులు, బాడీవాష్‌లు మొదలుకొని హెయిర్ ఆయిల్, కాఫీ పౌడర్, నూడుల్స్, ఆటాపై సగటున 2–9 శాతం మేర ధరలను సవరించాయి. హెయిర్ ఆయిల్‌పై ఈ పెంపు 8–11 శాతం మేర ఉంది. కొన్ని రకాల ఆహారోత్పత్తులపై ధరల బాదుడు 3 నుంచి 17 శాతం మధ్య ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కమోడిటీల ధరలు దిగొచ్చిన ఏడాది తర్వాత ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించడం ఇదే మొదటిసారి. ముడి సరుకుల (తయారీ) వ్యయాలు పెరిగిపోవడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు 2022, 2023లో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలను సవరించడం గమనార్హం. ముఖ్యంగా 2023–24 ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ధరల పెంపు జోలికి చాలా సంస్థలు వెళ్లలేదు. ఉత్పత్తుల తయారీలోకి వినియోగించే ముడి చమురు, పామాయిల్ ధరలు గతంతో పోలిస్తే తగ్గగా.. పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లే తదితర ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల కమోడిటీల ధరల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నందున 2024–25 ఆర్థిక సంవత్సరంలో ధరల సవరణ తప్పదని కంపెనీలు తమ మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా సంకేతమిచ్చాయి. మొత్తం మీద ధరల పెంపు సింగిల్ డిజిట్ (ఒక అంకె)కే పరిమితం కావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎఫ్ఎంసీజీ రంగంపై విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. పెంపు ఇలా.. కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ప్యాక్‌లపై మారికో 6 శాతం మేర ధరలు పెంచింది. కోప్రా (ఎండుకొబ్బరి) ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, మరో విడత ధరల సవరణ తప్పదన్న సంకేతం ఇచి్చంది. స్నాక్స్ తయారీ సంస్థ బికజీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–4 శాతం మేర ధరలు పెంచనున్నట్టు తెలిపింది. పోటీ సంస్థల మాదిరే తాము సైతం ధరలను పెంచుతున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపుజోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది. డవ్ సబ్బుల ధరలను 2 శాతం పెంచడం గమనార్హం. డాబర్ ఇండియా, ఇమామీ కంపెనీలు సింగిల్ డిజిట్ స్థాయిలో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బులపై 4–5 శాతం సవరించింది. సంతూర్ సబ్బుల ధరలను విప్రో సంస్థ 3 శాతం పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీవాష్ ధరలను కోల్గేట్ సంస్థ సింగిల్ డిజిట్ స్థాయిలో పెంచింది. హెచ్‌యూఎల్ పియర్స్ బాడీ వాష్ ధరలు 4 శాతం ప్రియమయ్యాయి. డటర్జెంట్ బ్రాండ్ల ధరలను హెచ్‌యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జ్యోతి ల్యాబ్స్ సంస్థలు 1–10 శాతం స్థాయిలో పెంచాయి. హెచ్‌యూఎల్ షాంపూల ధరలు తక్కువ సింగిల్ డిజిట్ స్థాయిలో (5 శాతంలోపు), చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4 శాతం చొప్పున సవరించింది. నెస్లే తన కాఫీ ఉత్పత్తుల ధరలను 8–13 శాతం మేర పెంచింది. మ్యాగి ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం పెరిగాయి. ఆశీర్వాద్ హోల్ వీట్ ఆటా ధరలు కూడా పెరిగాయి. -
వంటింట్లో సరుకుల మంట
- ఆకాశ మార్గం పట్టిన ధరలు - ఉడకనంటున్న పప్పులు - చిటపటలాడుతున్న చింతపండు - ఎండుమిర్చికి ధరల ఘాటు - నూనెలు సలసలా ఏలూరు సిటీ :వంట సరుకుల ధరలు ఆకాశ యానం చేస్తుండటంతో వంటింట్లో మంట రేగుతోంది. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. నెలవారీ బడ్జెట్ అమాంతం పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం పప్పుకూడు తిందామన్నా కష్టమవుతోందని సామాన్యులు బావురుమంటున్నారు. చింతపండుతో చారు పెట్టుకుందామన్నా ధర చూస్తే భయమేస్తోంది. ‘ధర’దడలు ఇలా గడచిన ఆరు నెలల కాలంలో నిత్యావసర సరుకుల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మొన్నటి వరకూ కిలో రూ.82 పలికిన కందిపప్పు ధర ఇప్పుడు రూ.110 నుంచి రూ.115 మధ్య ఉంది. సగటున కిలోకు రూ.30 పెరిగింది. దీంతో కందిపప్పు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెసరపప్పు కిలో రూ.95 నుంచి రూ.110 వరకు ధర పలుకుతోంది. మొన్నటివరకూ రూ.86 ఉండే కిలో మినుముల ధర రూ.96కు పెరిగింది. వేరుశనగ గుళ్ల ధర రూ.85 నుంచి రూ.116కు ఎగబాకింది. పచ్చి శనగపప్పు కిలో రూ.60, పంచదార కిలో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కనీసం చింతపండుతో రసం చేసుకుందామన్నా కష్టంగా మారింది. మొన్నటివరకూ కిలో రూ.76 వరకు ఉన్న చింతపండు ధర అమాంతం రూ.140కి పెరి గింది. ఎండుమిర్చి కిలోకు రూ.25 పెరి గింది. వెల్లుల్లి కిలో రూ.60 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వీటికి తోడు నూనె ధరలు కూడా దిగిరానంటున్నాయి. వేరుశనగ నూనె కిలో రూ.85నుంచి రూ.95, పామాయిల్ కిలో రూ.55 నుంచి రూ.60, సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ధర పలుకుతున్నాయి.