సీఈసీకి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యూఐ ర్యాలీ | NSUI members protest against the CEC Gyanesh Kumar resign demand | Sakshi
Sakshi News home page

సీఈసీకి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యూఐ ర్యాలీ

Oct 19 2026 6:34 AM | Updated on Oct 19 2026 6:34 AM

NSUI members protest against the CEC Gyanesh Kumar resign demand

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఢిల్లీలో ర్యాలీ చేపట్టింది. రైసినా రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యాలయం నుంచి కార్యకర్తలు చేపట్టిన శాంతియుత ర్యాలీ జంతర్‌మంతర్‌ వరకు సాగింది. యాత్ర ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్‌ జాకఢ్‌ సారథ్యంలో సాగింది.

 13 కోట్ల మంది ఓటర్లను అక్రమంగా తొలగించడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొంటూ తమ వేళ్లకు కట్లు కట్టుకుని నిరసన తెలిపారు. జంతర్‌ మంతర్‌ను నిరసన ప్రదర్శనలకు కేటాయించిన స్థలంగా తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి, హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement