తిరువనంతపురం: ఇళ్లలో ఉండే ఎయిర్ కండీషనర్( ఏసీ)లు విలాసవంతమైన ఉపకరణాలు కావు అని, ఇప్పుడు ఏసీ ప్రాథమిక అవసరంగా మారిపోయిందని కేరళం రాష్ట్ర మంత్రి కేఎం షాజీ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి పింఛను అర్హతలను పరిశీలించే సమయంలో అతడి ఇంట్లో ఏసీ ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకోరాదని సూచించారు.
కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితుల కారణంగా చాలా మంది రోగులకు ఏసీ అత్యవసర విషయంగా మారిందన్నారు. ఏసీ లేనిదే వారు జీవించలేరు అని ఆయన అన్నా. అందుకే, ఎవరినైనా పింఛనుకు అర్హులా కాదా అనేది నిర్ణయించే ప్రామాణాల నుంచి ‘ఏసీ’ని తీసివేయాలని కోరామన్నారు. కాగా, ఇంట్లో ఏసీ కలిగి ఉన్న వ్యక్తి పింఛనుకు అనర్హుడని కేరళ ప్రభుత్వ సామాజిక పింఛను అర్హత మార్గదర్శకాలు చెబుతున్నాయి.


