
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు.