రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

NHRC Issues Notice To Delhi Rajasthan Central Governmernt Over Former Protest In New Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్‌, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది.  ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

అందుకే కమిషన్‌ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది.  శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్‌ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ లెక్కించి అక్టోబర్‌ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది.

గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్‌ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’(యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది. 

చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !

చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం..

చదవండి: మళ్లీ రైతు రక్తం చిందింది.. సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది: రాహుల్‌ ఫైర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top