కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. | Karnataka MP Muni Swami Fires On Government Employees | Sakshi
Sakshi News home page

కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం..

Sep 14 2021 11:28 AM | Updated on Sep 14 2021 2:16 PM

Karnataka MP Muni Swami Fires On Government Employees  - Sakshi

సాక్షి, చింతామణి (కర్ణాటక): తాలూకాలోని మరినాయకనహళ్లి క్రాస్‌ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటనపై ఎంపీ మునిస్వామి అధికారులపై నిప్పులు చెరిగారు. సోమవారం ఉదయం ఆయన చింతామణి ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించిన అనంతరం ఆర్టీఓ అధికారులను అక్కడికే పిలిపించారు. వారిని చూడగానే ఎంపీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

విధులు నిర్వహించకుండా గాడిదలు కాస్తున్నారా... చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నడుపుతున్న వాహనాలను సీజ్‌ చేయకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.  అంతకు ముందు ఆయన మృతుల కుటుంబాలకు రూ. లక్ష అందించారు. ఎంపీ వెంట డీఎస్‌పీ లక్ష్మయ్య, తహశీల్దార్‌ హనుమంత రాయప్ప తదితరులు ఉన్నారు.  

చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement