డ్రగ్స్‌ అడ్డాగా పాన్‌షాప్‌.. ప్రముఖులే కస్టమర్లు

mumbai drugs case summons to others.. panshop is keyrole - Sakshi

ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులతో పాటు ఇతర వ్యాపారులు, పలువురు ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. తాజాగా శనివారం (జనవరి 9) ప్రముఖ పాన్‌ వ్యాపారి అరెస్టవడంతో కీలక మలుపు తీసుకుంది. మొత్తం మత్తు పదార్థాల ఆయన పాన్షాప్‌ నుంచి వెళ్తున్నాయని నార్కోటిక్స్‌ నియంత్రణ బోర్డు (ఎన్‌సీబీ) గుర్తించింది. దీంతో అతడికి ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది.

1970లో దక్షిణ ముంబైలో మొదలైన పాన్‌షాప్‌ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తుందని పోలీస్‌ అధికారులు గుర్తించారు. ముచ్చడ్‌ పాన్‌వాలాగా గుర్తింపు పొందిన పాన్‌ వ్యాపారి మనోజ్‌ తివారీ తన ఇద్దరు సోదరులతో కలిసి ఈ పాన్షాప్‌ను ఏర్పాటుచేశాడు. ఆకులు చుట్టుకుంటు ఉన్న మనోజ్‌ తివారీ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ప్రముఖులతో సత్సంబంధాలు పెంచుకోవడంతో ఈ పాన్‌షాప్‌ ప్రజలతో కిటకిటలాడేది. అయితే పాన్‌షాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీస్‌ అధికారులు ఆ దుకాణంలో జరుగుతున్న వ్యవహారం గుర్తించి.. సుశాంత్‌ సింగ్‌ కేసుకు లింక్‌లు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం మనోజ్‌ తివారీతో పాటు మరో ఇద్దరు మహిళలు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బ్రిటన్‌కు చెందిన కరణ్‌ సజ్‌నాని ఉన్నారు. శనివారం అరెస్ట్‌ చేసిన వారి వివరాలను సోమవారం ముంబై అధికారులు మీడియా ముఖంగా వెల్లడించారు. 

ముచ్చడ్‌ పాన్‌వాలాగా గుర్తింపు పొందిన మనోజ్‌ తివారీ వద్ద హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు, ఇతర పారిశ్రామికవేత్తలు కస్టమర్లుగా ఉన్నారు. అరెస్టయిన మహిళల్లో బ్రిటీష్‌ జాతీయురాలు కరణ్‌ సజనాని కాగా, మరొకరు రహీలా ఫర్నీచర్‌వాలా ఉన్నారు. రహీలా గతంలో ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌కు మేనేజర్‌గా పని చేసింది. రహీలా సోదరి సైష్టా గతంలోనే డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యింది. మొత్తం 200 కిలోల వివిధ రకాల మత్తుపదార్థాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. విలువైన వాటిని కరణ్‌ సజాని తీసుకున్నారు. కరణ్‌ సజాని అత్యంత సంపన్నులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తుండేది. వీటిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్స్‌ ముంబై జోనల్‌ కమిషనర్‌ సమీర్‌ వాంఖడే తెలిపారు. వారి నుంచి మొత్తం 200 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు.. వారితో సంబంధం ఉన్న వారికి సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top