‘విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంటులో పోరాడతాం’

MP Vijay Sai Reddy Briefs Media Over Parliamentary All Party Meeting In Delhi  - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. కాగా, సమావేశం అనంతరం వైఎస్సార్‌ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న మరో 24 పంటలకు కూడా కేంద్రం ఎంఎస్పీని ప్రకటించాలని  కోరామని పేర్కొన్నారు.

అదే విధంగా,  సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో..  దిశ బిల్లును ఆమోదించాలని,  విభజన హామీలన్ని నెరవేర్చేలా పోరాడతామని తెలిపారు. చంద్రబాబు.. ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

గతంలో.. వైఎస్సార్‌సీపీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి పలు అభ్యంతరాలను తెలిపిందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర విషయంలో వైఎస్సార్‌సీపీ తమ విధానాన్ని చాలా స్పష్టంగా విశదీకరించిందన్నారు. ఎంఎస్పీ లో ఎవరైతే స్టేక్‌ హోల్డర్స్‌ ఉన్నారో, వారితో చర్చించి వాటిని పునఃపరిశీలించాలని చెప్పడం జరిగిందని తెలిపారు.  

రైతులు, రైతు సంఘాలు, స్టేక్ హౌల్డర్స్ అభిమతాన్ని తెలుసుకునే విధంగా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి,  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top