'సహజీవనం అనే మాటే వినలేదు.. అది మన సంస్కృతి కాదు..' | Mp Navneet Rana On Live-in Relationships Same Sex Marriages | Sakshi
Sakshi News home page

'సహజీవనం అనే మాటే వినలేదు.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడమేంటి?'

Feb 14 2023 2:21 PM | Updated on Feb 14 2023 2:21 PM

Mp Navneet Rana On Live-in Relationships Same Sex Marriages - Sakshi

ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తన సొంత నియోజకవర్గం అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు సహజీవనం గురించి తన జీవితంలో ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు.

పైచదువుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే నగరాలకు పంపితే వారేమో లివ్ ఇన్ రిలేషన్ అంటూ తమకిష్టమైన వారితో కలిసి జీవిస్తున్నారని అన్నారు. అలాగే స్వలింగ సంపర్క వివాహలను కూడా నవనీత్ వ్యతిరేకించారు.

ఈరోజుల్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, అబ్బాయిలు అబ్బాయిలనే, అమ్మాయిలు అమ్మాయిలనే పెళ్లిచేసుకోవడం ఏంటి? అని వాపోయారు. సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాలు మన సంస్కృతి, సంప్రదాయాలే కాదని నవనీత్ పేర్కొన్నారు.
చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్‌!

Advertisement
 
Advertisement
Advertisement