వరుడి మెడలో నోట్ల దండ.. పక్కన ఫ్రెండ్‌ ఏం చేశాడంటే!

Money Heist: Groom Friend Theft Money From Garland - Sakshi

ఇటీవల పెళ్లి వీడియోలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వరుడు, వధువు డ్యాన్స్‌లు, లేదా వింత ఆచారాలు పాటించడం లాంటివి వల్ల వైరల్‌గా మారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వరుడి మెడలోని కరెన్సీ దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

అందులో.. పెళ్లి తతంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న వరుడి మెడలో బంధువులు కరెన్సీ దండలను వేసుంటారు. పెళ్లి కొడుకు అతిథులు ఏదో చెప్తుంటే బుద్ధిగా వింటుంటాడు. ఆ సమయంలో పక్కన కుర్చీలోనే కూర్చొన్న అతడి స్నేహితుడు ఆ కరెన్సీ దండల నుంచి చోరీకి ప్లాన్‌ వేస్తాడు. అనుకున్నదే తడువుగా అమలుకు ప్రయత్నిస్తాడు. అంతలో వరుడు అతని స్నహితుడి వైపు తలతిప్పి చూస్తాడు. ఆ వ్యక్తి వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన చేతిని వెనక్కి లాక్కుంటాడు.

అయితే వరుడు పెళ్లి తంతులో మళ్లీ బిజీ కావడంతో ఈ సారి కొన్ని నోట్లు దొంగలించి మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఆ పరిసరాల్లో ఉన్న ఒకరు వారి ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: ఆ గర్వం తలకెక్కింది.. ఇప్పుడు నేనేంటో తెలిసొచ్చింది: కచ్చా బాదామ్‌ సింగర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top