మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు | Sakshi
Sakshi News home page

మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్‌లో బుడ్డోడి వీడియో వైరల్‌

Published Mon, Oct 17 2022 9:21 PM

Mom Steals Chocolates Kid Innocent Complaint Gone Viral - Sakshi

భోపాల్‌: మూడేళ్ల బుడ్డోడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్‌గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్‌గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్‌ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది.

చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్‌కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్‌తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి..

చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్‌’

Advertisement
 

తప్పక చదవండి

Advertisement