వీసా కేటగిరీలు 13 నుంచి 9కి తగ్గింపు! | Ministry of Home Affairs to reduce Indian visa categories | Sakshi
Sakshi News home page

వీసా కేటగిరీలు 13 నుంచి 9కి తగ్గింపు!

Nov 5 2026 6:15 AM | Updated on Nov 5 2026 6:15 AM

Ministry of Home Affairs to reduce Indian visa categories

దరఖాస్తు ఫారాల పరిమాణం 70 శాతం కుదింపు 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: భారతదేశ వీసా విధానాన్ని సరళీకరించే ప్రక్రియలో భాగంగా ప్రధాన వీసా విభాగాల(కేటగిరీలు) సంఖ్యను 13 నుండి 9కి తగ్గించాలని, అలాగే వీసా దరఖాస్తు ఫారంల పరిమాణాన్ని 70 శాతం వరకు కుదించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ‘వీసా మాన్యువల్‌–2019’పై చేపట్టిన సమగ్ర సమీక్షలో భాగంగా అందులోని వివిధ అధ్యాయాలు, అనుబంధాలలో సవరణలు చేసే అవకాశం ఉందని, తద్వారా వీసాలు జారీ చేసే విభాగాల సంఖ్యను పరిమితం చేయనున్నట్లు పేర్కొన్నారు. వీసా మాన్యువల్‌–2019లోని వివిధ అధ్యాయాలకు, అలాగే అనుబంధాలకు సవరణలను ప్రవేశపెట్టేందుకు ఆగస్టులో సమావేశం జరిగింది. భారత వీసా విధానాన్ని హేతుబద్ధీకరించి, సరళీకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

 ప్రధాన వీసా వర్గాల సంఖ్యను 13 నుండి 9కి, ఉప–వర్గాల సంఖ్యను 49 నుండి 23కి తగ్గించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీసా దరఖాస్తు ఫారంలోని అంశాల్లో 70 శాతాన్ని తొలగించడం ద్వారా, వాటిని మరింత సరళంగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని తెలియజేశాయి. అవసరం లేని, పునరావృతమయ్యే, ఒకదానితో ఒకటి కలిసిపోయే అంశాలను తొలగించడం ద్వారా వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా వీసా ఫారంను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల, ఉప–రకాల వీసాలకు ఈ మార్పులను వర్తింపజేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement