సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలపై ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 21,900కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని హోంశాఖ వెల్లడించింది. ఈ మోసాలతో బాధితులు రూ.647 కోట్లకు పైగా నష్టపోయారని తెలిపింది. ఫిర్యాదుల మేరకు సత్వరమే స్పందించిన దర్యాప్తు విభాగాలు ఈ మొత్తంలో తిరిగి రూ.332 కోట్ల మేర నగదును బాధితులకు ఇప్పించగలిగాయంది. కేంద్ర హోంశాఖ ఇటీవల సుప్రీంకోర్టుకు సమరి్పంచిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.


