భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్‌

Minister Said New York Times Spreading Lies About India - Sakshi

కాశ్మీర్‌లోని పత్రికా స్వేచ్ఛ గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనంపై సమాచార ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ ఫైర్‌ అయ్యారు. దీనిపై న్యూయార్క్‌ టైమ్స్‌ కావాలనే తప్పుడు అభిప్రాయాలను ప్రచురిస్తోందన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య విలువలపై బురద జల్లే ప్రయత్నం అని మంత్రి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు సమాచార మంత్రి అనురాగ్‌ ‍‍ట్వీట్‌లో.."ఈ న్యూయర్క్‌ టైమ్స్‌ తోపాటు ఇతర కొన్ని లింక్‌లలో విదేశీ మీడియా భారతదేశం గురించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీ గురించి అసత్య ప్రచారాలను చేస్తోంది

ఇలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం కొనసాగ లేవు. భారత్‌పై పగ పెంచుకున్న కొన్ని విదేశీ మీడియాలు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. భారత్‌లో పత్రిక స్వేచ్ఛకు ఇతర ప్రాథమిక హక్కుల వలే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతదేశ ప్రజలు చాలా పరిణితి చెందినవారు. అలాంటి వాటిని అస్సలు అనుమతించరు. కాశ్మీర్‌లోని పత్రిక స్వేచ్ఛపై న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనం పచ్చి అబద్ధం, ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. అయినా భారత గడ్డపై విదేశీ మీడియా తమ నిర్ణయాత్మక అజెండాను అమలు చేయాలని చూస్తోందని, దీన్ని భారతీయలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమతించరు. అని నొక్కి చెప్పారు

(చదవండి: వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అ‍క్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top