నిటాషా వివాదం: ‘అందుకే భారత్‌లోకి రానివ్వలేదు’

MEA clarifies why It denied entry UK writer Nitasha Kaul India - Sakshi

భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్‌, రచయిత నిటాషా కౌల్‌ను భారత్‌లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్‌కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్‌ పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్‌లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు.

దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.  తాజాగా నిటాషాను భారత్‌లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది.

‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

తనను భారత్‌లోకి రానివ్వలేదని..ఎయిర్‌పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే  ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్‌కి ఇలా జరగలేదని అన్నారు.  అయితే ఆమె గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్‌ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top