ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి | Mayawati Says Muslims Targeted On UP | Sakshi
Sakshi News home page

ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి

Sep 4 2020 7:40 PM | Updated on Sep 4 2020 9:57 PM

Mayawati Says Muslims Targeted On UP  - Sakshi

లక్నో: యూపీలో  బ్రాహ్మణులు, దళితులు, ముస్లిములను టార్గెట్‌ చేశారని(లక్ష్యంగా చేసుకోవడం) బీఎస్‌పీ(బహుజన్‌ సమాజ్‌ పార్టీ) అధినేత మాయావతి తెలిపారు. శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడారు. యూపీలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆధిత్యనాథ్‌ ప్రభుత్వం దళితుల పై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తుందని విమర్శించారు. అయితే గతంలో పాలించిన ఎస్‌పీ(సమాజ్‌ వాదీ) ప్రభుత్వంలో  బ్రాహ్మణులు, దళితులు వివక్షకు గురయ్యారని మండిపడ్డారు

కాగా ఎస్‌పీ పాలనలో దిగ్గజ నాయకుల విగ్రహాలు ధ్వంసమయ్యావని, జిల్లాలు, సంస్థల పేర్లు (దళిత చిహ్నాలు) ఎస్‌పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ధ్వజమెత్తారు. మరోవైపు వారనాసి, జౌన్‌పూర్‌ ప్రాంతాలలో సంఘటనలను ఆమె విమర్శించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement