ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్‌ చేయడమంటే ఇష్టం.. అలా ఢిల్లీ వ్యక్తితో వివాహిత పరార్‌

Married Woman Elopes With Man Who Introduced On Social Media - Sakshi

బెంగళూరు: సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం ద్వారా పరిచయమైన వ్యక్తితో వివాహిత వెళ్లిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. యశవంతపుర పోలీసుస్టేషన్‌ పరిధిలోని సుబేదారపాళ్యలో జోసెఫ్‌ ఆంటోనీ అనే వ్యక్తి సీసీ కెమెరాలను రిపేరీ చేస్తుంటారు. ఆయన జార్ఖండ్‌కు చెందిన సుమిత్రాకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరకి 9, 4 ఏళ్లు వయసున్న ఇద్దరు కొడుకులున్నారు.

సుమిత్రకు ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్‌ చేయడమంటే ఇష్టం. రీల్స్‌ ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంది. ఇలా ఢిల్లీకి చెందిన దీపక్‌ మెహ్రా అనే వ్యక్తి ఆమెకు ఆరు నెలల క్రితం పరిచయం అయ్యాడు. జనవరి 8న దీపక్‌ బెంగళూరుకు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లాడు. ఇది తెలిసి జోసెఫ్‌ భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. జనవరి 26న సాయంత్రం ఐదు గంటలకు చిన్న కొడకును తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీపక్‌ మెహ్రాతో ఆమె పరారైందని, వెతికి పెట్టాలని భర్త జోసెఫ్‌ యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top