Bail Granted For Married Man After He Agrees To Marry 16-Year-Old Mumbai Girl - Sakshi
Sakshi News home page

బాలికను పెళ్లి చేసుకుంటానన్న వివాహితుడు..

Jan 28 2021 12:31 PM | Updated on Jan 28 2021 2:29 PM

Married Man Gets Bail After Says Marry To Girl He Impregnated - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

25 ఏళ్ల వివాహితుడు, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, నిందితుడు బెదిరించడంతో ఆమె ఎవరికీ విషయాన్ని చెప్పలేదు.

ముంబై: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం ఎంతమేరకు వారికి ఉపయోగపడుతోందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక దానిని లైంగిక వేధింపులుగా పరిగణించి నిందితుడిని శిక్షించలేమని బాంబే హైకోర్టు పన్నెండేళ్ల బాలిక విషయం లో జనవరి 19న ఇచ్చిన తీర్పు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేసులోనూ పోక్సో చట్టంపై అదే నాగ్‌పూర్‌ ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల బాలిక(మైనర్‌) చేతులు పట్టుకోవడం, ప్యాంటు విప్పడం వంటి వాటిని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. (చదవండి: జిప్‌ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు )

ఈ క్రమంలో ముంబై కోర్టు పదహారేళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసిన విధానం విస్మయం కలిగిస్తోంది. వివరాలు.. 25 ఏళ్ల వివాహితుడు, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, నిందితుడు బెదిరించడంతో ఆమె ఎవరికీ విషయాన్ని చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత బాధితురాలి శరీరంలో మార్పులు గమనించిన ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా గర్భవతి అని చెప్పారు. దీంతో నిందితుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడిని శిక్షించాలని కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. బెయిలు నిరాకరించింది.

అయితే కేసు నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నిందితుడు ఆమె తల్లిదండ్రులకు రాయబారం పంపాడు. ఇందుకు వారు అంగీకరించడం సహా, అతడి విడుదల చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని నిందితుడు కోర్టు ఎదుట చెప్పాడు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని న్యాయస్థానానికి తెలిపాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది. అయితే పోలీసులు మాత్రం అతడికి బెయిలు ఇవ్వొద్దని గట్టిగా వాదించారు. మొదటి భార్య రెండో వివాహానికి అంగీకరించినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని, పెళ్లి పేరిట శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. కానీ నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం.. అతడి కమ్యూనిటీలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేందుకు అవకాశం ఉందని, బెయిలు నిరాకరించాల్సిన అవసరం లేదంటూ తన వాదనలు వినిపించారు. దీంతో అతడికి జైలు నుంచి విముక్తి లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement