ఆటోడ్రైవర్ల ఫోన్లు కొట్టేస్తాడు, ఎందుకో తెలుసా?

Man Steals Phones from 70 Auto Drivers Because His Girlfriend - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని పుణేలో ఒక వ్యక్తి కేవలం ఆటో డ్రైవర్ల ఫోన్లు మాత్రమే కొట్టేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. 70కి పైగా స్మార్ట్‌ ఫోన్లను దొంగిలించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే అతను దొంగతనం చేయడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన ప్రియురాలు తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక ఆటో డ్రైవర్‌తో వెళ్లిపోయిందని తెలిపాడు. దాంతో ఆటో డ్రైవర్ల మీద కక్ష తీర్చుకోవడం కోసమే వారి ఫోన్లను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. 

అహ్మదాబాద్‌కు చెందిన ఆసిఫ్ అకా భురభాయ్ ఆరిఫ్ షేక్ ఒక రెస్టారెంట్‌ను నడుపుతుండే వాడు. అయితే అతను అక్కడి నుంచి తన 27 ఏళ్ల ప్రేయసితో కలిసి పుణే  వచ్చి ఒక బిజినెస్‌ ప్రారంభించాలనుకున్నాడు.  అక్కడికి వచ్చిన  రెండు రోజుల తరువాత అతని వద్ద ఉన్న డబ్బు తీసుకొని ఆమె ఒక ఆటో డ్రైవర్‌తో వెళ్లిపోయినట్లు ఆరిఫ్‌ షేక్‌ తెలిపాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరీఫ్‌ దగ్గర నుంచి 20 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.

చదవండి: దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top