breaking news
theaft
-
ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో ఒక వ్యక్తి కేవలం ఆటో డ్రైవర్ల ఫోన్లు మాత్రమే కొట్టేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. 70కి పైగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను దొంగతనం చేయడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన ప్రియురాలు తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక ఆటో డ్రైవర్‌తో వెళ్లిపోయిందని తెలిపాడు. దాంతో ఆటో డ్రైవర్ల మీద కక్ష తీర్చుకోవడం కోసమే వారి ఫోన్లను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. అహ్మదాబాద్‌కు చెందిన ఆసిఫ్ అకా భురభాయ్ ఆరిఫ్ షేక్ ఒక రెస్టారెంట్‌ను నడుపుతుండే వాడు. అయితే అతను అక్కడి నుంచి తన 27 ఏళ్ల ప్రేయసితో కలిసి పుణే వచ్చి ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు. అక్కడికి వచ్చిన రెండు రోజుల తరువాత అతని వద్ద ఉన్న డబ్బు తీసుకొని ఆమె ఒక ఆటో డ్రైవర్‌తో వెళ్లిపోయినట్లు ఆరిఫ్ షేక్ తెలిపాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరీఫ్ దగ్గర నుంచి 20 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. చదవండి: దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు -
ఆరుబయట నిద్రిస్తుంటే ఇల్లు గుల్ల చేశారు
లక్కిరెడ్డిపల్లె (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో సోమవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గ్రామం గంగమ్మ ఆలయ సమీపంలో ఉండే తిమ్మిరెడ్డి ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. వేసవి కావటంతో కుటుంబసభ్యులంతా ఇంటి బయట నిద్రిస్తుండగా, ఇంటికి వెనుక వైపున ఉన్న కిటికీని పగులగొట్టుకుని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.75 లక్షల నగదు ఎత్తుకుపోయారు. మంగళవారం బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.