ఆరుబయట నిద్రిస్తుంటే ఇల్లు గుల్ల చేశారు | robbery in ysr district | Sakshi
Sakshi News home page

ఆరుబయట నిద్రిస్తుంటే ఇల్లు గుల్ల చేశారు

Apr 21 2015 3:50 PM | Updated on Sep 3 2017 12:38 AM

వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో సోమవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు.

లక్కిరెడ్డిపల్లె (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో సోమవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గ్రామం గంగమ్మ ఆలయ సమీపంలో ఉండే తిమ్మిరెడ్డి ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు.

వేసవి కావటంతో కుటుంబసభ్యులంతా ఇంటి బయట నిద్రిస్తుండగా, ఇంటికి వెనుక వైపున ఉన్న కిటికీని పగులగొట్టుకుని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.75 లక్షల నగదు ఎత్తుకుపోయారు. మంగళవారం బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

పోల్

Advertisement