Mahakumbh 2025: కుంభమేళా కవర్‌ చేస్తున్న రిపోర్టర్‌.. ఇంతలో ఊహించని విధంగా | A Man Ran Away With A Reporters Mic At Prayagraj Maha Kumbh Mela 2025, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Mahakumbh 2025: కుంభమేళా కవర్‌ చేస్తున్న రిపోర్టర్‌.. ఇంతలో ఊహించని విధంగా

Jan 28 2025 8:59 AM | Updated on Jan 28 2025 10:28 AM

A Man Ran Away with a Reporters mic at Maha Kumbh

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కుంభమేళాకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ అలరిస్తోంది.

ఒక మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్‌ అత్యంత ఉత్సాహంగా కుంభమేళాపై వీడియో కవర్‌ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినవారిని పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఆ రిపోర్టర్‌ ఒక వ్యక్తిని కుంభమేళా అనుభవాల గురించి అడుగుతుండగా, ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు తాను మాట్లాడుతానని అడగడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఆ రిపోర్టర్‌ కొంచెం దూరంగా ఉండు.. తరువాత నువ్వు మాటాడవచ్చు అని చెబుతాడు. కొద్దిసేపు అలానే నిలబడిన ఆ యువకుడు ఒక్కసారిగా ముందుకువచ్చి, ఆ రిపోర్టర్‌ నుంచి మైక్‌ తీసుకుని పారిపోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది జరిగిన వెంటనే ఆ రిపోర్టర్‌తో పాటు అక్కడున్నవారంతా ఆ యువకుడిని వెంబడిస్తారు.
 

ఈ వీడియో @GaneshBhamu87 అనే ఖాతా నుంచి ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 71 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్‌ ఇది రిపోర్టర్‌ ఆడిన గేమ్‌ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు కుంభమేళాను రంగులమయం చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు

Advertisement
 
Advertisement
Advertisement