శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..! | Vontimitta Haritha Hotel Journalist Incident | Sakshi
Sakshi News home page

శృంగారంలో అపశృతి.. నాలుక కొరికిన మహిళ..!

May 6 2026 3:24 PM | Updated on May 6 2026 3:27 PM

Vontimitta Haritha Hotel Journalist Incident

వైఎస్ఆర్(కడప)జిల్లా : ఒంటిమిట్ట మండలంలో ఓ దినపత్రిక (సాక్షి కాదు) విలేకరి రవిబాబు(పుచ్చకాయల వ్యాపారి) నాలుకను ఓ మహిళ కొరికి వేసిన సంఘటన ఒంటిమిట్ట హరిత హోటల్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వివరాలు ఏమీ వెల్లడించలేదు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. 

కర్బూజ కాయల వ్యాపార క్రమంలో విలేకరి, ఆటో యజమానిలకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. విలేకరి రవి, ఆటో యజమాని ఒకరు ఆ మహిళతో కలిసి హరిత హోటల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా, గది అద్దె తీసుకోకుండానే అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని హరిత హోటల్‌ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే విలేకరి పరపతితో ఎట్టకేలకు గదిలోకి ముగ్గురు వెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఈ క్రమంలో శృంగార కార్యక్రమం నేపథ్యంలో విలేకరి నాలుకను మహిళ కొరికివేసింది. అయితే ఆ మహిళ ఇద్దరి చేతిలో జరుగుతున్న అఘాయత్యం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా కొరికి వేసిందా, కామక్రోధంతోనా అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. 

ఆ ప్రాంతం కొంత రక్తమయం అయింది. తీవ్ర భయాందోళనకు గురైన రవి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అక్కడికి వైద్యులు 108 ద్వారా కడప రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఆటో డ్రైవర్‌ హరి ఆ తర్వాత మహిళతో శృంగారం పూర్తి అయిన తర్వాత ఆమెను ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టారు. ఇక ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఒంటిమిట్టలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆటో డ్రైవర్‌ హరిని అదుపులో తీసుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆటో డ్రైవరు హరి సంఘటన తర్వాత ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలియాల్సి ఉంది.

వరుస వివాదాల్లో హరిత హోటల్‌
ఒంటిమిట్ట హరిత హోటల్‌ వరుస వివాదాలయమంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని హరిత హోటల్‌ భక్తులు, యాత్రీకులు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తే, ఆ క్రమం ఇప్పుడు దారి తప్పింది. వరుస ఘటనలతో రచ్చకెక్కుతోంది. గత ఏడాది అధికార పారీ్టకి చెందిన కొందరు అక్రమ మట్టి తవ్వకాల కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మందుబాబులకు నిలయంగా మారిన క్రమంలో మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే హరిత హోటల్‌లో పని చేస్తున్న దళిత యువకుడిపై, హోటల్‌ పక్కన కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడి చేసిన సంగతి విదితమే.

డివిజనల్‌ మేనేజరు ఏమంటున్నారంటే..
ఇన్‌చార్జి మేనేజరు రాజశేఖర్‌రెడ్డిని జరిగిన సంఘటనపై డివిజనల్‌ మేనేజరు మల్లికార్జున గౌడ్‌ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజరుకు మోమో ఇచ్చామన్నారు. సిబ్బంది పాత్రపై ఆరా తీశామన్నారు. విచారణలో అలాంటిది ఏమీ లేదన్నారు. స్థానికంగా ఉన్న వారిని దరిచేయనీయవద్దని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement