breaking news
haritha hotel
-
రూ.10,000 కోట్ల టూరిజం ఆస్తిపై గురి.. ప్రైవేట్‌కు ‘హరిత’ హారం
తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ముందుగానే ఆరు క్లస్టర్లకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లను పిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను ధారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్సిలీహిల్స్ హోటల్‌ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకే ప్రస్తుతం ఆర్ఎఫ్పీలో చేర్చలేదని సమాచారం. మరోవైపు బయటి వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని ఐదు హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కారు కాలరాస్తుండటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చిమ): నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు.. నేడు టూరిజం శాఖ హోటళ్లు..! కొత్తగా సంపద సృష్టించకపోగా.. భావి తరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది! ప్రభుత్వ ఆస్తులను భద్రంగా పరిరక్షించాల్సింది పోయి.. ప్రైవేట్‌కు ఏది కట్టబెట్టాలి? ఎలా కట్టబెట్టాలి? రాబట్టుకోవడం ఎలా? అనే ధ్యాసలోనే టీడీపీ పెద్దలు ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఒకపక్క ఇసుక నుంచి మద్యం సిండికేట్ల దాకా పచ్చ ముఠాల దోపిడీని ప్రోత్సహిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతూ నీకింత.. నాకింత...! అనే రీతిలో దోపిడీ వ్యవహారాలకు తెర తీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా.. ప్రతిదీ ప్రైవేట్‌పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారు! ఇప్పటికే 108, 104 సేవలను నీరుగార్చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటకశాఖ హోటళ్లపై కన్నేశారు! మంచి లాభాల్లో నడుస్తున్న హరిత హోటళ్లను తాము నిర్వహించలేమంటూ ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కారుచౌకగా దోచి పెడుతోంది! ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన హరిత హోటళ్లు, అనుబంధ ఆస్తులు ఒక్కటి కూడా లేకుండా చేయడంలో భాగంగా ఈ కుట్రకు తెర తీసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతం అరకులోని హరిత హోటళ్లను సైతం ప్రైవేట్‌కే ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు (ఆర్ఎఫ్పీ) ఇప్పటికే ఆహా్వనించారు. బిడ్ల దాఖలు గడువు ఈ నెల (నవంబర్) 7తో ముగియగా, వాటిని ఓపెన్ చేసి టెక్నికల్ వ్యాల్యూయేషన్ చేయాల్సి ఉంది. టెండర్లలో అర్హత సాధిస్తే కేబినెట్లో పెట్టి ఆమోదించుకోవటమే మిగిలింది! రూ.10 వేల కోట్ల ఆస్తి ప్రైవేటు పరం! ఏపీటీడీసీ హోటళ్లను ఆరు క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటళ్లు ఉండగా మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లీజుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వార్షిక స్థూల ఆదాయం/ఏపీటీడీసీ నిర్ణయించిన సగటు వార్షిక లీజు రేటు ఆధారంగా రెండింటిలో ఏది ఎక్కువైతే అది ప్రైవేటు ఏజెన్సీలు చెల్లించాలని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ సంస్థ తన ఆదాయాన్ని ఎంత వరకు కచ్చితత్వంతో వెల్లడిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రస్తుతం హోటళ్లు ఉన్న ప్రాంతంలో ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే మార్కెట్ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేటు ప్రకారం ఒక్క శాతాన్ని లీజుగా నిర్ణయించడం చూస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగుల కుటుంబాలు బలి.. ఏపీటీడీసీలో హోటళ్లు, వాటర్ ఫ్లీట్, ట్రాన్స్‌పోర్టు.. ఇలా వివిధ విభాగాల్లో సుమారు 1,300 మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఆప్కాస్, కన్సల్టెంట్లు, డైలీ వేజ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో రెగ్యులర్ ఉద్యోగులు డీవీఎంలు, మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయా హోటళ్లలో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలే తీసుకోవాలంటూ జీతభత్యాలు, ఉద్యోగ భద్రతను ప్రభుత్వం గాలిలో దీపంలా మార్చింది. ప్రైవేట్ ఏజెన్సీలు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను కొనసాగించుకోవాలని, రెండు నెలలకు ఒకసారి వారి పనితీరును అంచనా వేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా లేకుంటే ఏపీటీడీసీ, ప్రైవేటు ఏజెన్సీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అంటే వారికి ఉద్యోగ భద్రత లేదని తేలిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగులను తీసుకుంటే డీవీఎంలుగా సేవలందిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పనిచేస్తారా? వారికి జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ ఏజెన్సీల కింద పని చేయాల్సి వస్తే డీవీఎం కార్యాలయాలు, వాటికి అనుబంధంగా ఉండే సీఆర్వో కార్యాలయాలు మూతపడే అవకాశం లేకపోలేదు. తద్వారా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. హోటళ్లు ప్రైవేట్‌కు వెళ్లిపోవడం వల్ల ఇన్నాళ్లూ ప్రజలకు సేవలందిస్తున్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని డీవీఎం కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.భారీగా రాబడి కోల్పోతున్న టూరిజం..ఏపీటీడీసీ హోటళ్ల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో హోటళ్లను ఆధునికీకరించారు. దీనికోసం విజయవాడలోని బెరంపార్కు హోటల్‌తో పాటు ఇతర హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి జీజీహెచ్‌కు సమీపంలోని ఓ స్టేట్‌బ్యాంక్ నుంచి రూ.150 కోట్ల రుణానికి అనుమతులు పొందారు. ఇందులో రూ.100 కోట్లతో హోటళ్ల ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తున్న అభివృద్ధి చేసిన హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ దర్శన టికెట్ల కోటాను రద్దు చేయడంతో ఏపీటీడీసీ ఏడాదికి రూ.72 కోట్ల నుంచి రూ.84 కోట్ల రాబడిని కోల్పోయింది. ఇప్పుడు 22 హరిత హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల ఏటా మరో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర రెవెన్యూకి గ్యారంటీ లేకుండా పోతుంది. ఇంత అభద్రత మధ్య ఉద్యోగులు, ఏపీటీడీసీ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కూటమి సర్కారు వ్యాపారం చేస్తోంది. -
హరిత.. ఏదీ నీ భవిత?
కడప కల్చరల్ : డాక్టర్ వైఎస్సార్ హయాంలో జిల్లాలో పర్యాటకం పరుగులు తీసింది. ఊహించని స్థాయిలో ఆ రంగం అభివృద్ధి పథంలో పయనించింది. పర్యాటకం మాటే వినిపించని మన జిల్లాలో పదికి పైగా హరిత హోటళ్లు ఏర్పాటయ్యాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిర్వహణ బలహీనపడి ఈ హోటళ్లన్నీ ప్రైవేటుపరం అయ్యే దిశగా సాగుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. వరుస కరువులతో తల్లడిల్లుతున్న మన జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలోని 27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించారు. దీంతోపాటు జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలలో పది హరిత హోటళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన కడప నగరంలో లగ్జరీ ఏసీ సూట్లు, రెస్టారెంట్లతో మంచి హోటల్‌ను నిర్మించారు. అనతికాలంలోనే దీనికి మంచి పేరు వచ్చింది. వ్యాపారం కూడా పెరిగింది. మిగతా హోటళ్లు కూడా క్రమంగా అభివృద్ధి బాట పట్టాయి. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ వైఎస్ ఆకస్మిక మరణంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు స్థానికులు ఎంతో మొరపెట్టుకున్నా అభివృద్ధిని కొనసాగించకపోగా, జిల్లా పట్ల వివక్ష చూపి అంగుళం కూడా అభివృద్ధి అయ్యేందుకు సహకరించలేదు. లీజు దిశగా ఒకప్పుడు లాభాలు చవిచూసిన కడప నగర సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద ఉన్న హరిత రెస్టారెంట్, తాళ్లపాకలో ఉన్న హరిత రెస్టారెంట్లను లీజుకు ఇచ్చేశారు. దేవుని కడప, పాత కడప చెరువు గట్టుపైగల హరిత హోటల్ భవనాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. గోపవరం హరిత హోటల్లో కూడా వ్యాపారాలు లేకపోవడంతో మూసేశారు. దీన్ని లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మసాగర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ పరిస్థితి కూడా చతికిలపడింది. లైసెన్సులు గల డ్రైవర్లు మాత్రమే బోటు నడపాలని అధికారులు ఆదేశించడంతో లైసెన్స్ గల బోటు డ్రైవర్ లభించక బోట్లు మూలనపడ్డాయి. దీని నుంచి ఒక్క పైసా కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదు. గోవపరంతోపాటు అత్తిరాల, మరికొన్ని ప్రాంతాల్లో హరిత భవనాలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోకపోవడం విశేషం. సిద్దవటంలో కోట వద్ద పాత భవనాన్ని రూ. 7 లక్షలు వెచ్చించి పర్యాటక హోటల్‌గా రీమోడల్ చేశారు. ఈ హోటల్లో సిద్దవటంలోని ఇతర హోటళ్లలో ధరలతో పోలిస్తే రెండు, మూడు అంతలు ఎక్కువగా ఉండడంతో స్థానికులు అటువైపు వెళ్లడం మానేశారు. అంతర్గత ఆధిపత్య పోరు హరిత హోటళ్లలోని ఉద్యోగుల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కార్యాలయ ఉద్యోగులు తమ కిందిస్థాయి ఉద్యోగులపై అధికార దర్పం చూపుతూ మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ సిబ్బంది కూడా అవినీతి బాట పట్టారు. పది గదులు బుక్ అయితే సగం మాత్రమే చూపడం, పది భోజనాలు ఖర్చయితే అందులోనూ సగమే చూపడం, బార్లో బయటి మద్యం తెప్పించడం తదితర కారణాలతో నష్టాలను మాత్రమే చూపే పరిస్థితి ఏర్పడింది. పర్యవేక్షణ కోసం ఉండాల్సిన మేనేజర్లు ఈ ఉద్యోగుల వేధింపులకు తాళలేక చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. జిల్లాలో దాదాపు ఆరు నెలలుగా మేనేజర్ లేరు. డిప్యూటీ మేనేజర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన హరిత హోటళ్లు ఇప్పుడు నష్టాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే జిల్లాలోని సగం çహోటళ్లు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేశారు. మిగతా హోటళ్లనైనా కాపాడుకోలేక పోతే అవి కూడా ప్రభుత్వం చేజారిపోయే ప్రమాదముందని ప్రజలు పేర్కొంటున్నారు. నష్టాలు ఎందుకు? మొన్నటివరకు లాభాల బాటన పరుగులు తీసిన హరిత హోటళ్ల వ్యాపారం ఇటీవల పర్యాటకుల సందడి పెరుగుతున్న నేపథ్యంలో హోటళ్లు దివాళా తీయడం పట్ల విమర్శలు రేగాయి. పర్యాటకరంగం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలు ఈ రంగం అభివృద్ధి చెందాక ఎందుకు రావడం లేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అందుకే ఈ çహోటళ్ల నిర్వహణ తెల్ల ఏనుగులా మారింది. అధికారుల్లో అసహనం మొదలై చివరికి వీటిని లీజుకు ఇచ్చేస్తే కనీస మొత్తానికి గ్యారంటీ ఉంటుందని భావించారు. జిల్లాలోని హరిత హోటళ్లలో ఇప్పటికే కొన్నింటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేయగా, మిగతావి కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి. అన్నీ నష్టాల బాటే జిల్లాలో అత్యధికంగా వ్యాపారం జరుగుతున్న హరిత హోటళ్లలో గండికోట హోటల్ ఒకటి. ఒకప్పుడు నెలకు రూ. 7.50 లక్షలు వ్యాపారం జరిగేది. వారాంతాల్లో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చినపుడు రూ. 9–10 లక్షల వరకు వ్యాపారం జరిగేది. ఇక్కడ 53 గదులు, ఒక డార్మెంటరీ ఉన్నాయి. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత లోపం, అందించడంలో ఆలస్యం అంశాలపై విమర్శలు ఉన్నాయి. నిర్వహణలో లాభాల కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలోని ప్రధాన హరిత హోటల్లో ఉన్న గదుల్లో వసతి లేమి కారణంగా దాదాపు సంవత్సరం నుంచి పలు గదుల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. రెస్టారెంట్ పూర్తిగా మూతపడింది. ఒకప్పుడు రోజుకు రూ. లక్షకు పైగా జరిగే వ్యాపారం ప్రస్తుతం రూ. 20–30 వేలకు దిగజారింది. అంతో ఇంతో జరుగుతున్న బార్‌పై మాత్రమే కొద్దిగా లాభం చూడగలుగుతున్నారు. ఇడుపులపాయ హరిత హోటల్ కూడా భారీగానే నిర్మించారు. ఇందులో 23 గదులు ఉన్నాయి. విశాలమైన ఇలాంటి గదులు జిల్లాలోని ఏ హరిత హోటళ్లలోనూ లేవు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. రోజురోజుకు వ్యాపారం మందగించి ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నట్లు సమాచారం. -
‘హరిత’లో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి, ధర్మపురి: ధర్మపురిలోని హరితహోటల్లో పర్యాటకంమాటున రాసలీలలు కొనసాగుతున్నాయి. మందుబాబులు.. విటులు హోటల్‌ను వేదిక చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రెండునెలల క్రితం మందుబాబులతోపాటు కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. ఆ సంఘటన మరువకముందే సోమవారం ఓ జంట రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ధర్మపురికి వచ్చే పర్యాటకుల కోసం గోదావరి ఒడ్డున మూడేళ్ల క్రితం పర్యాటక శాఖా వారి ఆధ్వర్యంలో హరితహోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్లో మద్యం, మాంసానికి తావులేదు. హోటల్లో ఉండాలంటే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటారు. హోటల్లో చేరేముందు పర్యాటకుల ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసు కోవాల్సి ఉంటుంది. నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండునెలల క్రితం పోలీసులు దాడుల చేయగా.. హోటల్ అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఆ సమయంలో మేనేజర్‌ను సస్పెం డ్ చేశారు. అప్పటినుంచి హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అడ్డంగా దొరికిన జంట భార్యాభర్తలమని చెప్పి హోటల్‌ను అద్దెకు తీసుకున్న ఓ జంట రెండురోజులుగా బయటకు రావడం లేదు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పోలీసులు గదిని తెరువగా ఆ జంట రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. గదిలో మందుతోపాటు ఇతర వస్తువులున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత (భర్త నుంచి విడాకులు తీసుకుంది) సిద్దిపేటకు చెందిన ఓ యు వకుడితో ప్రేమలో పడింది. హోటల్లో గదిని తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. అయినా సిబ్బంది ఆధార్‌కార్డులు పరిశీలించకుండానే వారినుంచి కొంతసొమ్ము తీసుకుని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీఐ లక్ష్మీబాబు జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. హోటల్ నిర్వాహకులనూ మందలించారు. తప్పుడు ధ్రువీ కరణ పత్రాలతో వస్తే గదులు ఇవ్వవద్దని సూచించారు. -
‘పట్టుకో’లేవు..!
- పర్యాటక హోటళ్లలో ఇంటి దొంగలు - హోటల్ ప్లాజాలో రూ.లక్షల్లో నగదు స్వాహా - హరిత హోటళ్లలో దొంగ బిల్లులతో కన్నం - సీఎం పాల్గొన్న టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలోనూ.. - ఆదాయం తగ్గి హోటళ్లు మూసేయాల్సిన దుస్థితి సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్‌లో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న స్టార్ హోటల్.. ఓ వ్యక్తి తన కూతురి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాడు.. బిల్లు రూ.లక్ష రాగా కొంత మొత్తం నగదు రూపంలో, మిగిలిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు.. కానీ హోటల్ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాలేదు. మరి ఏమైందనుకుంటున్నారా.. సిబ్బంది జేబులోకి వచ్చిపడింది. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులకు అను మానం రావడం లేదు. వినియోగదారులు చెల్లించిన నగదులో కొంత పక్కదారి పడుతోంటే చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. హరిత పేరుతో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న హోటళ్లలోనూ ఇదే పరిస్థితి. ఖాళీ బిల్లుల తో సిబ్బందే డబ్బులు స్వాహా చేస్తున్నారు. బిల్లింగ్ సెక్షన్ నుంచి.. బేగంపేటలో ప్లాజా పేరుతో పర్యాటక శాఖకు సొంతంగా స్టార్ హోటల్ ఉంది. నెలకు రూ.95 లక్షల వరకు ఆదాయం వస్తుండగా, ఖర్చులు పోను రూ.20 లక్షల వరకు లాభం తెచ్చిపెడుతున్న ఈ హోటల్ ఇప్పుడు ఇంటి దొంగలకు నిలయమైంది. రెండేళ్లుగా కొందరు ఉద్యోగులు రూ.లక్షల్లో నగదు మాయం చేస్తున్నారు. వినియోగదారులు నగదు రూపం లో బిల్లు చెల్లించినప్పుడు హస్తలాఘవం చూపుతున్నారు. బిల్లులను పరిశీలించాల్సిన అకౌంట్స్ విభాగం నిద్రపోతోంది. ప్రధాన కార్యాలయం నుంచీ తనిఖీలు జరగటం లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు గుర్తించక పోవటం అనుమానాలకు తావిస్తోంది. వరంగల్ హరిత హోటల్లో.. వరంగల్ జిల్లాలోని ఓ హరిత హోటల్ సిబ్బంది ఓ ప్రైవేటు సంస్థ పేరుతో బిల్ బుక్ దగ్గర పెట్టుకుని కూరగాయలు, చికెన్ ఇతర వస్తువుల పేరుతో బిల్లులు సృష్టించి నగదు మాయం చేస్తున్నారు. మిగిలిన హోటళ్లలోనూ ఇదే స్థితి. దీంతో ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయని, ఈ క్రమంలో సిబ్బంది సంఖ్యను తగ్గించేశారు. ఫలితంగా హోటళ్లలో సరైన సేవలందక వాటి ఖ్యాతి దిగదుడుపు అవుతోం ది. కొన్ని చోట్ల హోటళ్లనే మూసేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఇంటి దొంగల వ్యవహా రంపై ఇటీవల కొందరు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. -
సెప్టెంబర్‌లో హైదరాబాద్ వేదికగా మరో భారీ ఎగ్జిబిషన్
సోమాజిగూడ(హైదరాబాద్): హైదరాబాద్ నగరం మరో భారీ ఐటీ ఎగ్జిబిషన్‌కు వేదికగా నిలవనుంది. వచ్చే నెల సెప్టెంబర్ 25, 26, 27వ తేదీలలో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ‘ఐటీ ఏషియా- 2015’ పేరుతో ఎంఏఐటీతో కలసి భారీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. గురువారం బేగంపేట హరితా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఎంఏఐటీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్వర్ షిర్‌పూర్‌వాలాతో కలసి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 సంస్థలు, ఆరు రాష్టాలు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఐటీ రంగంలోని కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు రకాల కంపెనీలను ఒకే వేదికపై తేవడానికి, మరింత సమర్దవంతంగా అనుసంధానం కల్పించడానికి ఎగ్జిబిషన్ నిర్వహణ దోహదం చేస్తుందన్నారు.


