వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టావ్‌.. | Man Life End To Insta Like | Sakshi
Sakshi News home page

వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టావ్‌..

Jan 26 2025 11:07 AM | Updated on Jan 26 2025 11:07 AM

Man Life End To Insta Like

=ప్రియురాలి గొడవతో ప్రియుడు ఆత్మహత్య   

బనశంకరి: సోషల్‌ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో మరో యువతికి కాబోయే భర్త లైక్‌ కొట్టినందుకు యువతి అతన్ని  మందలించింది. ఇది నచ్చని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకా పూంజాకట్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.   కుక్కిప్పాడి నివాసి చేతన్‌ (25) కాంతార మాదిరి దేవుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.  కుందాపురలో చైతన్య అనే యువతి ఇన్‌స్టా లో పరిచయమైంది.

 స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 8 నెలల క్రితం ఇరువురికి  నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 21వ తేదీన చేతన్‌ ఇన్‌స్టాలో మరో యువతి ఫోటోకు లైక్‌ కొట్టాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి  ప్రియురాలు చైతన్య, చేతన్‌ ఇంటికి వెళ్లింది. వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టావని గొడవకు దిగింది. క్రమంగా తీవ్ర వివాదంగా మారింది. మనస్థాపం చెందిన చేతన్‌ వెంటనే పై గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. నీ కొడుకు నిద్రపోయాడని, పిలిచినా లేవలేదని చైతన్య కాబోయే అత్త పుష్పకు ఫోన్‌ చేసి చెప్పింది. ఇంటికి చేరుకున్న చేతన్‌ తల్లి ఇంటి పై గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement