భార్యాపిల్లలను చంపి వ్యక్తి సూసైడ్‌..కారణమిదే..

Up Man Kills Wife And Two Sons Committs Suicide - Sakshi

లక్నో: కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు కొడుకులను దారుణంగా చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగింది.‘భార్యతో గొడవలతో మనస్తాపం చెందిన శ్రవణ్‌రామ్‌(35) అనే వ్యక్తి తనభార్య శశికల(30) ఇద్దరు కొడుకులు సూర్యారావ్‌(7),మిట్టు(4)లను పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు.

‘శ్రవణ్‌రామ్‌కు ఆయన భార్యకు మధ్య ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. ఆదివారం కూడా వారిరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శ్రవణ్‌రామ్‌ తన భార్యా పిల్లలను చంపి ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాల వల్లే భార్యాపిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ శ్రవణ్‌రామ్‌ జేబులో దొరికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు  తెలిపారు. 

ఇదీచదవండి..జార్ఖండ్‌ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top