
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతున్న సమయంలో మాజీ మంత్రి 'పద్మాకర్ వల్వి' (Padmakar Valvi) బీజేపీలో చేరుతున్నట్లు షాకిచ్చారు.
వల్వి బీజేపీలోకి మారనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు 'చంద్రశేఖర్ బవాన్‌కులే'ను కలిసిన ఆయన ఎట్టకేలకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో రేపు (మార్చి 13) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు సమాచారం.
పద్మాకర్ వల్వి 2009లో నందుర్బార్‌లోని షహదా నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ క్రీడా మంత్రిగా కూడా పనిచేసిన వాల్వి, నందుర్బార్ & ఉత్తర మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రముఖ నేతలలో ఒకరు. ఈయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.