
పూసల దండలు అమ్మేందుకు కుంభమేళాకు వచ్చిన మోనాలిసా వాటిని అమ్మిందో లేదోగానీ, తన నీలికళ్ల అందాలతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు ప్రకటనల్లో నటించే అవకాశాలు ఆమెకు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న మోసాలిసా ఫొటోలను చూస్తే ఈమె కుంభమేళాలో పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన మోనాలిసానేనా అనేలా ఉన్నాయి.
మోనాలిసా ప్రస్తుతం తన తొలి బాలీవుడ్ డెబ్యూకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఆమె ఒకవైపు నటన నేర్చుకుంటూనే, మరోవైపు అక్షరాలు కూడా దిద్దుతోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించనుంది. తాజాగా సనోజ్ మిశ్రా, మోనాలిసాలు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ చేరుకున్నారు. ఈ నేపధ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె గులాబీరంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె కురులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. కొద్దిపాటి మేకప్‌తో మోసాలిసా సహజ సౌందర్యరాశిలా నవ్వుతూ కనిపిస్తోంది. కోట్ల రూపాయల ఖరీదైన కారులో ఆమె ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ సమయంలో ఆమె అత్యంత ఖరీదైన వజ్రాల హారం కూడా ధరించింది. కార్యక్రమానికి హాజరైన అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు తెగ తాపత్రయపడ్డారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
Comments
Please login to add a commentAdd a comment