న్యూ ఇయర్ పార్టీలో తుపాకీతో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Madhya Pradesh Congress MLA Suneel Saraf Fired Gun New Year - Sakshi

భోపాల్: న్యూ ఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేశారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరఫ్. బాలీవుడ్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ.. సడన్‌గా జేబులోనుంచి గన్ తీశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. జనవరి 1న జరిగిన ఘటనకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు.

అయితే జనవరి 1న ఎమ్మెల్యే పుట్టినరోజు కూడా అని సన్నిహితులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, స్నేహితులు ఆదివారం వేడుక చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలోనే స్టేజీపై ఉత్సాహంగా డాన్స్ చేసిన ఎమ్మెల్యే తుపాకీతో సరదాగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

సునీల్ సరఫ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది కొత్తేం కాదు. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రైలులో మహిళతో దురుసుగా ప్రవర్తించినప్పుడు కూడా మీడియాలో ఫోకస్ అయ్యారు. ఇప్పుడు తుపాకీతో కాల్పులు జరిపి మరోసారి వార్తల్లోకెక్కారు.
చదవండి: 'సమాజం ఎటుపోతుందో ‍అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top