ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ

Published Sun, Aug 27 2023 6:38 AM

Madhya Pradesh CM Shivraj Singh Chouhan expands cabinet - Sakshi

భోపాల్‌: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్‌ శుక్లా, గౌరీశంకర్‌ బిసెన్, రాహుల్‌ లోధిలను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్‌ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. 

Advertisement
 
Advertisement