
తమిళనాడులో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో మోసం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, తిరుపత్తూర్: తమిళనాడులో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో మోసం వెలుగులోకి వచ్చింది. తిరుపత్తూర్ ఇండియన్ బ్యాంక్‌లో అప్రైజర్ చేతివాటం ప్రదర్శించాడు. నకిలీ బంగారంతో రూ.కోటిన్నర రూపాయలను జోలార్‌పేట సమీపంలోని కరుప్పనూర్ గ్రామానికి చెందిన భాస్కరన్ కాజేశారు. అతను 2011 నుంచి బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు.
42 మందితో నకిలీ బంగారం తాకట్టు పెట్టించిన భాస్కరన్.. మోసానికి తెర తీశాడు. నగదులెక్కల్లో తేడాలు రావడంతో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కరన్ బాగోతం బయటపడింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.