Lok Sabha Election 2024: మట్టిమనిషి! | Lok Sabha Election 2024: Jahanara Khan daughter of a coal miner and labourer at Asansol Lok Sabha | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: మట్టిమనిషి!

May 12 2024 4:51 AM | Updated on May 12 2024 4:51 AM

Lok Sabha Election 2024: Jahanara Khan daughter of a coal miner and labourer at Asansol Lok Sabha

జహనారా ఖాన్‌. పశి్చమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానంలో సీపీఎం అభ్యర్థి. బొగ్గు గని కార్మికుని కూతురు. రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగిన సాదాసీదా మహిళ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మట్టి బిడ్డ. జమూరియా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా వంటి దిగ్గజాలకు గట్టిపోటీ ఇస్తున్నారు...     

చిన్న స్థాయి నుంచి... 
జహనారా తండ్రి మైనింగ్‌ కార్మికుడు. సీపీఎం నాయకుడు. ఆమె జమూరియాలోని రాణిగంజ్‌ మహిళా కాలేజీలో చదువుకున్నారు. 1990లో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటికీ ఈసీఎల్‌లో ఒక చిన్న పాత ఇంట్లో తోబుట్టువులతో కలసి ఉంటారామె. జహనారా వృత్తి రీత్యా టీచర్‌. వెనకబడిన కుటుంబాల్లోని చిన్నారులు, యువత జీవితాల్లో వెలుగు నింపేందుకు పాతికేళ్ల కిందే బాల్‌ బోధన్‌ శిక్షా నికేతన్‌ పేరిట హిందీ మీడియం స్కూలు ప్రారంభించారు. 

జమురియాలోని 
దక్షిణ పరాసియా మైనింగ్‌ ప్రాంతంలో ఉందీ స్కూలు. ఇందులో చదువుకున్న వాళ్లే ఇప్పుడు టీచర్లుగా స్వచ్ఛందంగా పని చేస్తుండటం విశేషం. అనంతరం తండ్రి రాజకీయ బాటలో నడిచి తొలుత సీపీఎం యువజన సంఘంలో పని చేశారు. జమూరియా మహిళా సంఘ నాయకురాలిగా ఎదిగారు. జమూరియా పంచాయతీ ప్రధాన్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2008లో జమురియా పంచాయతీ అధ్యక్షురాలయ్యారు. 

తృణమూల్‌ హవా సాగుతున్న 2011, 2016ల్లో వరుసగా రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకున్న ఆదరణకు నిదర్శనం. స్థానికంగానూ అత్యంత శక్తిమంతురాలైన నాయకురాలిగా ఎదిగారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జమూరియా నుంచి విద్యార్థి నాయకురాలు అయిషీ ఘోష్‌కు సీపీఎం టికెటిచి్చంది. దాంతో జహనారా పార్టీ కార్యకలాపాలపై, పాఠశాలపై దృష్టి సారించారు. తొలిసారిగా ఇప్పుడు లోక్‌సభ బరిలో దిగుతున్నారామె. కారి్మకుల కుటుంబాలు అధికంగా ఉండే అసన్‌సోల్‌లో ఆమె గెలుపు తథ్యమని సీపీఎం భావిస్తోంది. 

పోరాడేవారే గెలుస్తారు... 
నటులు, గాయకులతో ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు రాదంటారు జహనారా. కారి్మకులు, ప్రజల పక్షాన పోరాడే సీపీఎం తప్పక విజయం సాధిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ‘‘రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది. మహిళలు సురక్షితంగా లేరు. 2011 పార్క్‌ స్ట్రీట్‌ సంఘటన నుంచి, నేటి సందేశ్‌ఖాలీ వరకూ మహిళలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. బెంగాల్‌ ఆడపిల్లలను తృణమూల్‌ ప్రభుత్వం సరుకులుగా మార్చింది. రాష్ట్రమంతటా మహిళలపై జరుగుతున్న అణచివేతపై నిరసన, ప్రతిఘటన అగి్నజ్వాలగా మారుతోంది. సమస్యల పరిష్కారంలో తృణమూల్, బీజేపీలు విఫలమయ్యాయి’’ అని విమర్శిస్తున్నారు. పదేళ్లుగా కోల్పోయిన అసన్‌సోల్‌ ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టడం తన బాధ్యత అని చెబుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement