Chandrayaan-3: Lander Vikram Sends First Pics Of Moon - Sakshi
Sakshi News home page

Chandrayaan 3: జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్ చేసిన ఇస్రో..

Aug 18 2023 6:39 PM | Updated on Aug 18 2023 7:28 PM

Lander Vikram Sends First Pics Of Moon - Sakshi

ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది.

బెంగళూరు: చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌-3.. ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. ఈ మేరకు ల్యాండర్ విక్రమ్ మొదటిసారి చంద్రుని ఫొటోలను పంపించింది. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి గురువారమే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుని కక్ష‍్యలో పరిభ్రమిస్తూ జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ఆ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 

ల్యాండర్ విక్రమ్ తీసిన మొదటి ఫొటోలో చంద్రునిపై ఉన్న బిలాలను కూడా ఇస్రో గుర్తించింది. గార్డియానో బ్రూనో క్రేటర్ అనే పేరు కలిగిన బిలాన్ని గుర్తించారు. ఇటీవలే గుర్తించిన ఈ బిలం వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉంటుంది. అయితే.. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ మరింత విజయవంతమైనట్లు తెలిపారు.

ఒకసారి ల్యాండర్ చంద్రున్ని తాకిన తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడివడుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం రోవర్ కీలక సమాచారాన్ని సేకరిస్తుందని వెల్లడించింది. చంద్రుని ఆకృతి, శిథిలాలు, నీటి జాడ వంటి అనేక విషయాలను శోధిస్తుంది. 

ఇదీ చదవండి: India First 3D Printed Post Office: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో!

Advertisement
 
Advertisement
Advertisement