ప్రజలతో మూడు ముక్కలాట ఆడుతున్నారు | Kishan Reddy comments over BRS and Congress and MIM | Sakshi
Sakshi News home page

ప్రజలతో మూడు ముక్కలాట ఆడుతున్నారు

Jul 30 2023 1:41 AM | Updated on Jul 30 2023 2:05 AM

Kishan Reddy comments over BRS and Congress and MIM - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలది ముక్కోణపు ప్రేమకథ అని... ఈ మూడు పార్టీలూ కలిసి తెలంగాణ ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నా యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆ మూడు పార్టీలు నాటకాలు ఆడు తూ అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తు న్నాయని విమర్శించారు.

తెలంగాణలో ఎన్ని కలకు ముందు లేదా తర్వాత కలిసి  ప్రయాణం చేసే ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయా పార్టీల అసలు స్వరూ పం తెలిసిపోయిందని, అందుకే బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ (మల్కాజ్‌గిరి), నేతలు జైపాల్‌ రెడ్డి (జహీరాబాద్‌), లక్ష్మారెడ్డి (రంగారెడ్డి) కాషా య కండువా కప్పుకున్నారు.

కిషన్‌ రెడ్డి,  పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌  సమక్షంలో ఈ నలుగురు నాయకులకు పార్టీ సభ్యత్వ రశీదు అందించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారు బీజేపీలో చేరారని...  మరిన్ని చేరికలు ఉండేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామన్నారు.

జిట్టా ఆరోపణలకు స్పందించను
ఏ రోజు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయలేదని.. భవిష్యత్తులోనూ పనిచేయ బోదని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచే స్తుందన్నారు. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి ఇచ్చే సర్టిఫికెట్‌ తనకు అవసరం లేదని.. అతను చేసే ఆరోపణలపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజే పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ,  2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళారని, అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల నమ్మకం పోయిందన్నారు. త్వరలోనే కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు.

చైతన్యంలేని రాహుల్‌ నేతృత్వంలో ఎలా పనిచేస్తాం
బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్లలో కనీసం 50 సార్లు రాహుల్‌ గాంధీని కలిసినా... కనీసం తనను గుర్తుపట్టలే రన్నారు. రాజకీయ చైతన్యం లేని రాహుల్‌గాంధీలాంటి నేత నేతృత్వంలో ఎవరైనా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని... డూప్లికేట్లు, అన్ని పార్టీలు తిరిగొచ్చిన నేతలు, మిక్స్‌డ్‌ పార్టీల నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement