‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు | Kharge Calls Sitharaman Mataji Laughter In Rajyasabha | Sakshi
Sakshi News home page

‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు

Jul 24 2024 8:29 PM | Updated on Jul 24 2024 8:29 PM

Kharge Calls Sitharaman Mataji Laughter In Rajyasabha

న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.

వెంటనే చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కేవలం బిహార్‌, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్‌ ఖర్గేతో అన్నారు. 

మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్‌ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్‌ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement